మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Sri Ganesha Stotram – 3 (Daridrya Dahanam) – శ్రీ గణపతి స్తోత్రం – ౩ (దారిద్ర్యదహనం)

సువర్ణవర్ణసుందరం సితైకదంతబంధురం
గృహీతపాశకాంకుశం వరప్రదాఽభయప్రదమ్ |
చతుర్భుజం త్రిలోచనం భుజంగమోపవీతినం
ప్రఫుల్లవారిజాసనం భజామి సింధురాననమ్ || 1 ||

కిరీటహారకుండలం ప్రదీప్తబాహుభూషణం
ప్రచండరత్నకంకణం ప్రశోభితాంఘ్రియష్టికమ్ |
ప్రభాతసూర్యసుందరాంబరద్వయప్రధారిణం
సరలహేమనూపురం ప్రశోభితాంఘ్రిపంకజమ్ || 2 ||

సువర్ణదండమండితప్రచండచారుచామరం
గృహప్రతీర్ణసుందరం యుగక్షణం ప్రమోదితమ్ |
కవీంద్రచిత్తరంజకం మహావిపత్తిభంజకం
షడక్షరస్వరూపిణం భజేద్గజేంద్రరూపిణమ్ || 3 ||

విరించివిష్ణువందితం విరూపలోచనస్తుతిం
గిరీశదర్శనేచ్ఛయా సమర్పితం పరాశయా |
నిరంతరం సురాసురైః సపుత్రవామలోచనైః
మహామఖేష్టమిష్టకర్మసు భజామి తుందిలమ్ || 4 ||

మదౌఘలుబ్ధచంచలార్కమంజుగుంజితారవం
ప్రబుద్ధచిత్తరంజకం ప్రమోదకర్ణచాలకమ్ |
అనన్యభక్తిమానవం ప్రచండముక్తిదాయకం
నమామి నిత్యమాదరేణ వక్రతుండనాయకమ్ || 5 ||

దారిద్ర్యవిద్రావణమాశు కామదం
స్తోత్రం పఠేదేతదజస్రమాదరాత్ |
పుత్రీకలత్రస్వజనేషు మైత్రీ
పుమాన్మవేదేకవరప్రసాదాత్ || 6 ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శ్రీ గణపతి స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.